close

తాజా వార్తలు

పవన్‌ పేరుతో వచ్చిన ఆ లేఖ కట్టుకథే!

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పదవిని వదులుకొని సినిమాల్లో నటిస్తారంటూ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలన్నీ అవాస్తవమని ఆ పార్టీ స్పష్టంచేసింది. పవన్‌ పేరిట ప్రచారం అవుతున్న ఆ లేఖ కట్టుకథలతో కూడినదని పేర్కొంది. జనసేనానికి ఉన్న అభిమానగణం, ఆయన పేరిట జరుగుతున్న సేవా కార్యక్రమాలు చూసి ఓర్వలేక కొందరు ఈ విధంగా తప్పుడు లేఖలు సృష్టిస్తున్నట్టు తమ పార్టీ దృష్టికి వచ్చిందంటూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయమై కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపింది. నిరంతరం ప్రజలకు చేరువగా ఉండి వారి పక్షాన పోరాడడమే పవన్‌ లక్ష్యమని, అందుకు ఆయన ప్రజా క్షేత్రంలోనే ఉంటున్నారని పవన్‌ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.