close

తాజా వార్తలు

ఒక్క రోజూ విశ్రాంతి తీసుకోలేదు: రాజ్‌నాథ్‌

ఘజియాబాద్ ‌(యూపీ): ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోలేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఘజియాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చి 100 రోజుల పూర్తి చేసుకున్నప్పటికీ ఏ ఒక్క రోజూ ఈ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోలేదని చెప్పారు. ఈ వంద రోజుల్లో అద్భుత పనితీరును కనబరిచామని చెప్పుకొచ్చారు. అంతకుముందు 100 రోజుల పాలనపై ప్రధాని మోదీ, అమిత్‌షా మాట్లాడారు. ఎన్నో కీలక మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఓ దిశా నిర్దేశంలేని ప్రభుత్వం అంటూ ఆర్థిక వ్యవస్థనుద్దేశించి విమర్శలు చేసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.