close

తాజా వార్తలు

ప్రణబ్‌ కుమార్తెకు కాంగ్రెస్‌ కీలక బాధ్యతలు


దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ తనయుడు అన్షుల్‌ కుమార్‌కు కాంగ్రెస్‌ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించింది. వీరిద్దరినీ నియమిస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఓ ప్రకటనలో వెల్లడించారు. శర్మిష్ఠ ముఖర్జి దిల్లీ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. తనను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించినందుకు ఆమె సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.