
తాజా వార్తలు
బెంగళూరు: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. తన తండ్రి మనీలాండరింగ్ కేసు వ్యవహారంలో ఈ నెల 12న దిల్లీలో జరిగే విచారణకు హాజరు కావాలని సూచించారు. శివకుమార్ ఆర్థికలావాదేవీలను పరిశీలిస్తున్న క్రమంలో ఆయన కుమార్తె నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు సంబంధించిన పత్రాలు ఈడీ దృష్టికి వచ్చాయని ఈడీ అధికారి ఒకరు వెల్లడించారు. ఆ ట్రస్ట్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై వివరాలు తెలుసుకొనేందుకే ఆమెకు సమన్లు జారీచేసినట్టు తెలిపారు.
మనీలాండరింగ్ కేసులో డీకేఎస్‌ను రెండు రోజుల పాటు దిల్లీలో విచారించిన ఈడీ అధికారులు ఈ నెల 3న ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనను దిల్లీ కోర్టు ఆయనను పది రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. నోట్ల రద్దు సమయంలో ఈడీ, ఐటీశాఖలు డీకేఎస్ ఆర్థిక వ్యవహారాలపై నిఘా వుంచాయి. ఈ క్రమంలోనే 2017 ఆగస్టు 2న దిల్లీలోని శివకుమార్ నివాసంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.8.59 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకొని ఆయనతో పాటు పలువురు సన్నహితులపైనా కేసులు నమోదు చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఆంగ్లమాధ్యమంపై సంవాదం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
