Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009355
            [news_title_telugu_html] => 

త్వరలో పీవోకే మన సొంతమవుతుంది

[news_title_telugu] => త్వరలో పీవోకే మన సొంతమవుతుంది [news_title_english] => By 2022 PoK also part of India Asserts Shiv Sena MP [news_short_description] => భాజపా మిత్రపక్షమైన శివసేన పార్టీలో కీలక నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 కల్లా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత వశమవుతుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ జోస్యం చెప్పారు. ఇటీవల కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన మోదీ, ఇదే తరహాలో పీవోకేను కూడా సాధిస్తారని వ్యాఖ్యానించారు. [news_tags_keywords] => Sanjay Raut, Shiv Sena MP, PoK, India [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 00:14:22 [news_isactive] => 1 [news_status] => 2 ) )
త్వరలో పీవోకే మన సొంతమవుతుంది - By 2022 PoK also part of India Asserts Shiv Sena MP - EENADU
close

తాజా వార్తలు

త్వరలో పీవోకే మన సొంతమవుతుంది

శివసేన ఎంపీ వ్యాఖ్య

ముంబయి: భాజపా మిత్రపక్షమైన శివసేన పార్టీలో కీలక నాయకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 కల్లా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ భారత వశమవుతుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ జోస్యం చెప్పారు. ఇటీవల కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన మోదీ, ఇదే తరహాలో పీవోకేను కూడా సాధిస్తారని వ్యాఖ్యానించారు. ‘‘కశ్మీర్‌ అంశం తమ అంతర్గత విషయమని ఇప్పటికే మోదీ ట్రంప్‌కు స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తీరు కూడా భిన్నంగా ఉంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ మొత్తాన్ని ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. ఈ పరిణామాల దృష్ట్యా త్వరలోనే పీవోకే మన వశం కాబోతోంది. 2022 కల్లా అఖండ భారత్‌ కల నిజం కానుంది’’ అని వ్యాఖ్యానించారు. సంజయ్‌ రౌత్‌ శివసేన అధికార పత్రిక సామ్నాకు సంపాదకుడిగా కూడా ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. మోదీ తర్వాతి అడుగు పీవోకేపైనే ఉంటుందని ఆయన అన్నారు. కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని, ఆర్టికల్‌ 370 రద్దును శివసేన గట్టిగా సమర్థించిన సంగతి తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.