Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009366
            [news_title_telugu_html] => 

’ఆ నిర్ణయం పార్టీ ప్రయోజనాల కోసం కాదు’

[news_title_telugu] => ’ఆ నిర్ణయం పార్టీ ప్రయోజనాల కోసం కాదు’ [news_title_english] => bjp rammadhav comments on article 370 [news_short_description] => కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 100 రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. తమ ప్రభుత్వ నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలోని వైకాపా సర్కారు కూడా 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్నప్పటీకీ ఇంకా ఎటు వెళ్లాలో స్పష్టత లేకుండా పోయిందన్నారు. విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఆర్టికల్ 370 రద్దు అంశంపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి [news_tags_keywords] => ram madhav,bjp,vijayawada  [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 23:55:06 [news_isactive] => 1 [news_status] => 2 ) )
’ఆ నిర్ణయం పార్టీ ప్రయోజనాల కోసం కాదు’ - bjp rammadhav comments on article 370 - EENADU
close

తాజా వార్తలు

’ఆ నిర్ణయం పార్టీ ప్రయోజనాల కోసం కాదు’

విజయవాడ: కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం 100 రోజుల్లోనే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ అన్నారు. తమ ప్రభుత్వ నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలోని వైకాపా సర్కారు కూడా 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్నప్పటీకీ ఇంకా ఎటు వెళ్లాలో స్పష్టత లేకుండా పోయిందన్నారు. విజయవాడలోని ది వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో ఆర్టికల్ 370 రద్దు అంశంపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రామ్‌మాధవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 370 అధికరణ రద్దుపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు.. 1949లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆర్టికల్‌ 370ని ముక్తకంఠంతో వ్యతిరేకించినప్పటికీ నెహ్రూ మాట కోసం రాజ్యాంగంలో ఎలా చొప్పించారని విమర్శించారు. 370 అధికరణ రద్దు పార్టీ ప్రయోజనాల కోసం కాదన్నారు. దేశం కోసం, కాశ్మీరీ ప్రజల కోసం అని గుర్తు చేశారు. కాశ్మీర్లో 70 ఏళ్లుగా రాచపుండుగా ఉన్న 370 అధికరణాన్ని మోదీ ప్రభుత్వం 72 గంటల్లో రద్దు చేసి సమస్యను పరిష్కరించిందన్నారు. భాజపా ఆవిర్భావం నాడే ఈ అధికరణం రద్దుకు పూనుకుందన్నారు. రాజకీయ పరిపక్వత లేని వారే దీనిపై విమర్శలు చేస్తున్నారన్నారు. పౌర హక్కులు హరిస్తూ.. కాశ్మీరీ మహిళల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉన్న ఈ అధికరణాన్ని రద్దు చేసినట్లు గుర్తుచేశారు. కాశ్మీర్ ప్రజలు అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారన్నారు. తమ హితం కోరే పార్టీగా భాజపాను గుర్తిస్తున్నారన్నారని రామ్‌మాధవ్‌ పేర్కొన్నారు. కాశ్మీర్ ప్రజల అభివృద్ధికి అవరోధంగా ఉన్న 370 అధికరణతో రద్దుని అందరూ స్వాగతించడం శుభపరిణామంగా రామ్ మాధవ్ చెప్పుకొచ్చారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.