
తాజా వార్తలు
భువనేశ్వర్ అర్బన్ (ఒడిశా), న్యూస్‌టుడే: ఆ గ్రామంలో బిక్షమెత్తుకుంటున్న ఓ అనాథ వృద్ధుడు చనిపోయాడు. అయితే గ్రామస్థులెవరూ అంత్యక్రియలకు ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు యువకులు ముందుకొచ్చి ఔదార్యం చాటారు. సైకిల్‌పై మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం అనుగుల్ జిల్లా రెంగాలి కొలని గ్రామంలో గిరిధారి గండొ భార్యతో కలిసి 40 ఏళ్లుగా ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం భార్య మృతి చెందడంతో గిరిధారి ఒంటరివాడయ్యాడు. భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురైన గిరిధారి మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. గ్రామంలోని ఇద్దరు యువకులు శరత్ గండొ, శంకర్ మాఝి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులూ స్పందించకపోవడంతో వారే సైకిల్‌పై మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లి గొయ్యి తవ్వి పూడ్చారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
