Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009743
            [news_title_telugu_html] => 

తెదేపా స్వార్థరాజకీయాలు పని చేయలేదు

[news_title_telugu] => తెదేపా స్వార్థరాజకీయాలు పని చేయలేదు [news_title_english] => AP Home Minister Sucharita Pressmeet [news_short_description] => ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదనే ఉద్దేశంతోనే ఆత్మకూరులో 144 సెక్షన్ విధించామని, అక్కడేదో జరిగిపోయిందని మాత్రం కాదని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. [news_tags_keywords] => Ap news,Sucharita,YSRCP,TDP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 14:01:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తెదేపా స్వార్థరాజకీయాలు పని చేయలేదు - AP Home Minister Sucharita Pressmeet - EENADU
close

తాజా వార్తలు

తెదేపా స్వార్థరాజకీయాలు పని చేయలేదు

అమరావతి: ర్యాలీలు, ఆందోళనలకు అనుమతి లేదనే ఉద్దేశంతోనే ఆత్మకూరులో 144 సెక్షన్ విధించామని, అక్కడేదో జరిగిపోయిందని మాత్రం కాదని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు తెదేపా ‘చలో అత్మకూరు’కు పిలుపునివ్వటం సమంజసం కాదని వాఖ్యానించారు. రెండు వైపులా బాధితులున్నారని, దీనికి సంబంధించిన కేసులపై దర్యాప్తు కొనసాగుతోందని ఆమె వెల్లడించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుచరిత మాట్లాడారు. తెదేపా స్వార్థ రాజకీయం పల్నాడులో పని చేయలేదని ఆమె ఎద్దేవా చేశారు. తెదేపా శిబిరం నుండి కార్యకర్తలు ఎందుకు వెళ్లిపోతున్నారో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. 

గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వో వనజాక్షి, మరో ఐపీఎస్ అధికారిపైనా ప్రజాప్రతినిధులు దాడికి తెగబడ్డారని సుచరిత విమర్శించారు. అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ఆరోపించారు. దళిత మహిళా ఎస్సైని కులం పేరుతో దూషించటం తగదని.. సదరు ఎస్సై ఫిర్యాదు చేస్తే తక్షణం బాధ్యులపై చర్యలు చేపడతామని సుచరిత అన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో ఏఆర్, ఏపీఎస్పీ, జైలు వార్డర్స్ కానిస్టేబుళ్ల ఫలితాలను విడుదల చేశామని ఆమె తెలిపారు.  2623 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, ఇందులో 500 మంది మహిళలు ఉద్యోగాలు పొందారన్నారు. త్వరలోనే పోలీస్ శాఖలో ఖాళీలన్నిటినీ భర్తీ చేయనున్నామని స్పష్టం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.