Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009823
            [news_title_telugu_html] => 

ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది:మోదీ

[news_title_telugu] => ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది:మోదీ [news_title_english] => This Was Trailer Film Abhi Baaki Hai says PM Modi [news_short_description] => తమ 100 రోజుల పాలన కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.. పూర్తి సినిమా ఇంకా ముందుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గురువారం జార్ఖండ్‌లోని రాంచీలో....... [news_tags_keywords] => Modi,100 days administration,politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-13 00:18:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది:మోదీ - This Was Trailer Film Abhi Baaki Hai says PM Modi - EENADU
close

తాజా వార్తలు

ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది:మోదీ

రాంచీ: తమ ప్రభుత్వ 100 రోజుల పాలన కేవలం ట్రైలర్‌ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా ముందుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గురువారం ఝార్ఖండ్‌లోని రాంచీలో పర్యటించిన ప్రధాని.. అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎన్డీయే -2 ప్రభుత్వం వంద రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారమే ప్రజలకు సమర్థమైన, వేగంగా పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నామని.. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. ఈ 100 రోజుల పాలన కేవలంల ట్రైలర్‌ మాత్రమేనన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 

ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వారిని ఎక్కడ ఉంచాలో.. అక్కడికే పంపిస్తున్నామనీ.. ఇప్పటికే కొందరిని పంపామని మోదీ వ్యాఖ్యానించారు.  అభివృద్ధి అనేది తమ నినాదమన్నారు. కశ్మీర్‌, లద్దాఖ్‌లను అభివృద్ధి చేసేందుకు నిబద్ధతతో పనిచేస్తామన్నారు. ముస్లిం సోదరిలకు అండగా నిలబడతామన్నారు. ఇప్పటికే  ట్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేస్తూ బిల్లు తీసుకురావడం ద్వారా ఆ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఫలవంతంగా సాగాయన్న ప్రధాని.. అందుకు ఎంపీలందరికీ అభినందించాలన్నారు. రాష్ట్రంలోని రఘుబర్‌ దాస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.