close

తాజా వార్తలు

‘పవన్‌.. తెదేపా ఉచ్చులో పడొద్దు’

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు నవరత్నాలకు అనుకూలమో, వ్యతిరేకమో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. వైకాపా 100 రోజుల పాలనపై జనసేన నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి, పోలవరంలో అవినీతి జరిగిందనే తాము చెబుతున్నామని, అవినీతిని పవన్‌కల్యాణ్‌ సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ ఎలా జరిగిందో పవన్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. ఇసుక విధానం సరిదిద్దే ప్రయత్నంలో కాస్త ఆలస్యం అవుతోందని మంత్రి వివరించారు. తెలుగుదేశం ఉచ్చులో పడొద్దని పవన్‌కు తాను విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్‌ ఒక్కసారైనా గాజువాక నియోజకవర్గంలోని ప్రజలను కలిశారా? అని ప్రశ్నించారు. చిరంజీవిలా కష్టపడి స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి బొత్స అని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై విమర్శలు తగవన్నారు. రాజధాని విషయంలో పవన్‌ కల్యాణ్‌ యూటర్న్‌ తీసుకొని మాట్లాడడం సరికాదని మంత్రి హితవు పలికారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.