close

తాజా వార్తలు

కశ్మీర్‌ వెళ్లడానికి ఆజాద్‌ను అనుమతించిన సుప్రీం!

దిల్లీ: కశ్మీర్‌ వెళ్లి తన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు సుప్రీం కోర్టు అనుమతించింది. కేవలం జమ్ము, అనంత్‌నాగ్‌, బారాముల్లా, శ్రీనగర్‌ జిల్లాలకు మాత్రమే వెళ్లడానికి అంగీకరించింది. అయితే ఈ సందర్భంగా ఎలాంటి రాజకీయ ప్రదర్శనలు నిర్వహించొద్దని ఆదేశించింది. ప్రజలతో మాట్లాడి, పరిస్థితులను తెలుసుకునేందుకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదని అభిప్రాయపడింది. అయితే అవి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు దారితీయకూడదని సూచించింది. అధికరణ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పలు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. 

అధికరణ 370 అచేతనం తర్వాత కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాజకీయ నేతల్ని రాష్ట్రంలో పర్యటించడానికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌ వెళ్లడానికి పలువురు నాయకుల చేసిన యత్నాలు విఫలమైన విషయం తెలిసిందే. అదే రాష్ట్రానికి చెందిన గులాం నబీ ఆజాద్‌ని సైతం పోలీసులు శ్రీనగర్‌ విమానాశ్రయంలో అడ్డుకొన్నారు. దీంతో కనీసం తన కుటుంబ సభ్యుల్ని కలిసేందుకైనా అనుమతించాలని ఆజాద్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.