close

తాజా వార్తలు

‘పరిశీలించాకే కోడెల మృతిని నిర్థారించాం’

బసవతారకం ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ టీఎస్‌ రావు

హైదరాబాద్‌: తెదేపా సీనియర్‌ నేత, మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావును అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని.. నిశితంగా పరిశీలించాకే ఆయన మృతిచెందినట్లు నిర్ధారించామని బసవతారకం మెడికల్‌ డైరెక్టర్‌ టీఎస్‌ రావు తెలిపారు. కోడెల మృతిచెందిన తర్వాతే పోలీసులకు సమాచారం అందించామన్నారు. ఈనాడు-ఈటీవీతో టీఎస్‌ రావు మాట్లాడారు. 

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఫౌండర్ ఛైర్మన్‌గా కోడెల శివప్రసాద్ పదేళ్లపాటు ఉన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎలాంటి అనారోగ్యం వచ్చినా ఆయన ఈ ఆస్పత్రిలోనే చూపించుకుంటారని చెప్పారు. క్యాన్సర్ రోగులకే కాకుండా సాధారణ రోగులు, సిబ్బందికి కూడా తమ ఆస్పత్రిలో చికిత్సలు చేస్తామని తెలిపారు. కోడెల మరణం బసవతారకం ఆస్పత్రికి తీరని లోటని టీఎస్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.