close

తాజా వార్తలు

మరో ఆరు మృతదేహాల వెలికితీత

రాజమహేంద్రవరం : గోదావరిలో చోటుచేసుకున్న ఘోర బోటు ప్రమాదంలో గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవాళ మరో 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద ఐదు మృతదేహాలను గుర్తించగా.. కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద మరో మృతదేహాన్ని సహాయక సిబ్బంది వెలికితీశారు. అనంతరం రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. పంచనామా నిర్వహించి మృదేహాలను బంధువులకు అప్పగించారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటివరకూ 34 మృతదేహాలను గుర్తించారు. గల్లంతైన మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాపికొండలకు వెళ్లే బోటు ప్రమాదంలో గల్లంతైనవారి గుర్తింపులో నిన్న పురోగతి కనిపించింది.  తొలిరోజు ప్రవాహంలో 8 మృతదేహాలు కొట్టుకురాగా.. మూడోరోజు 20 లభ్యమయ్యాయి.

నేడు వెలికితీసిన మృతదేహాల వివరాలు..

మహేశ్వర్‌రెడ్డి(నంద్యాల)

రాజేంద్రప్రసాద్‌(వరంగల్‌ జిల్లా కడిపికొండ) 

శ్రీనివాసరావు(పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం అప్పనవీడు)

తాలిబ్‌ పటేల్‌(హైదరాబాద్‌ టౌలీచౌకీ)

పెద్దిరెడ్డి దాలమ్మ(విశాఖ జిల్లా గోపాలపురం)

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.