close

తాజా వార్తలు

23నుంచి బతుకమ్మ చీరల పంపిణీ: కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ మహిళలకు బతుకమ్మ కానుకగా ప్రభుత్వం అందించనున్న చీరలను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సీడీఎంఏ భవంతిలో ప్రదర్శనకు ఉంచారు. పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఏటా బతుకమ్మ చీరలను మరింత నాణ్యతతో తయారు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం సుమారు రూ.300కోట్లకు పైగా వెచ్చించి వంద డిజైన్లలో చీరలను తయారు చేయించిందన్నారు. ఈనెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీని ప్రారంభిస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.