
తాజా వార్తలు
తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టు విషయంలో పారదర్శక విధానంతోనే ముందుకెళ్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పునరుద్ఘాటించారు. రివర్స్ టెండరింగ్ ప్రక్రియను పారదర్శకతతో నిర్వహించామన్నారు. తాడేపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి జగన్కు అనుకూలమైనవారికి కట్టబెట్టలేదని తెదేపా నేతలు తెలుసుకోవాలన్నారు. ఇకనైనా తెదేపా నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవుపలికారు. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.58 కోట్లు మిగిల్చామని చెప్పారు. కేవలం రూ.274 కోట్ల పనికి రూ.58 కోట్లు మిగల్చగలిగామన్నారు. రివర్స్ టెండరింగ్లో పాత కాంట్రాక్టర్లు పాల్గొనవద్దని ఎక్కడా చెప్పలేదని, నవయుగ సంస్థ కూడా టెండరు వేయవచ్చని మంత్రి తెలిపారు. ఈ విధానాన్ని త్వరలోనే అన్ని రాష్ట్రాలు అవలంబించే రోజు వస్తుందని అభిప్రాయపడ్డారు. తెదేపా నేతలు కావాలనే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం వేల కోట్ల టెండర్లలో కాంట్రాక్టర్లకు ప్రజాధనం దోచిపెట్టిందని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రివర్స్ టెండర్ల ద్వారా ప్రజాధనాన్ని మిగిల్చిందని మంత్రి అన్నారు.
గత ప్రభుత్వం స్పిల్వే పనులను మాత్రమే పూర్తి చేసి పేద ప్రజలకు సంబంధించిన ఆర్అండ్ఆర్ను పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. తెదేపా హయాంలో ఎక్కువకు కోడ్ చేసిన సంస్థే ఇప్పుడు తక్కువకు వచ్చిందని, అదే సంస్థ 15.6 శాతం తక్కుగా ముందుకొచ్చిందని వెల్లడించారు. మంచి ఆలోచనతో ముందుకెళ్తున్న సీఎం జగన్ను విమర్శించడమే తెదేపా నేతలు పనిగా పెట్టుకున్నారని మంత్రి విమర్శించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- నీవు లేని జీవితం ఊహించలేను: రోహిత్
- ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
