close

తాజా వార్తలు

ఐటీఐఆర్‌కు నయాపైసా ఇవ్వలేదు: కేటీఆర్‌

హైదరాబాద్‌: యూపీఏ హయాంలో ఐటీఐఆర్‌కు నయాపైసా ఇవ్వలేదని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పురోగతిపై అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు బట్టి విక్రమార్క ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని చెప్పారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రాష్ట్రంలో 12.67 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. ఐటీ రంగంలోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తున్నామన్న కేటీఆర్‌.. ఆ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 5.5 లక్షలకు చేరిందని తెలిపారు.బెంగళూరును తలదన్నేలా ఐటీలో దూసుకెళ్తున్నామని వివరించారు. గూగుల్‌ వంటి దిగ్గజ సంస్థలను బెంగళూరును కాదని హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నందునే రాష్ట్ర వృద్ధి రేటు అధికంగా ఉందని మంత్రి వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
tsmbanner
Saket Pranamam
besttaxfiler
dr madhu
VITEEE 2020

Panch Pataka

దేవతార్చన