
తాజా వార్తలు
హైదరాబాద్: హుజూర్నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో 30వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. హుజూర్ నగర్ స్థానానికి సంబంధించి పోలింగ్ తేదీని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. జానారెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం చేస్తామని వివరించారు. ఈ ఎన్నిక అధికార అహంకారానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఇంతవరకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.
అక్టోబరు 21న హుజూర్నగర్ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబరు 30తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. అక్టోబరు 1న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 3 వరకు గడువు విధించారు. అక్టోబరు 21న ఎన్నికలు నిర్వహించి అక్టోబరు 24న ఫలితాలు వెల్లడించనున్నారు. ఉప ఎన్నిక తేదీని ప్రకటించిన నేపథ్యంలో తెరాస సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో గందరగోళం కొనసాగుతోంది. ఉత్తమ్ సతీమణిని అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి తప్పుబట్టారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్కౌంటర్పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
