close

తాజా వార్తలు

‘చిత్ర’ వార్తలు

ఆకలి గంట మోగుతోంది.. బండి గంట కొట్టెదెప్పుడో!


చిత్రంలోని చిన్నారిని చూస్తుంటే మధ్యాహ్న భోజనం చేసేందుకు క్లాస్‌లో నుంచి ముందుగానే వచ్చి వరుసలో నిల్చున్నట్టుంది కదూ! కానీ ఆ చిన్నారి విద్యార్థిని కాదు. పాఠశాల సమీపంలోని బస్తీ నుంచి వచ్చి రోజూ మధ్యాహ్న భోజనం అనంతరం మిగిలిన పదార్థాలను తీసుకెళుతూ ఉంటుంది. ఈ క్రమంలో శనివారం భోజన విరామ సమయం కంటే ముందుగానే వచ్చి ఇలా తరగతి గది బయట వేచిచూస్తుండగా.. తీసిందీ చిత్రం. హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్‌ నవోదయ కాలనీలోని ప్రాథమిక పాఠశాల వద్ద జరిగింది.

నీటి పొదుపు నినాదం కాదు.. విధానమైంది!


దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏర్పాటులో అక్షయ పాత్ర ఫౌండేషన్‌ పాత్ర ప్రముఖమైంది. ఇస్కాన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్‌ దేశం నుంచి ఆకలిని పారదోలడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. సంగారెడ్డి జిల్లా కందిలో ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర వంటశాలలో కేవలం గంట సమయంలో లక్ష మందికి భోజనాలను సమకూర్చగల సామర్థ్యముంది. ఇక్కడ రోజూ దాదాపు 10 టన్నుల బియ్యం, 3 టన్నుల కూరగాయలు, దాదాపు 3 టన్నుల పప్పును వినియోగిస్తున్నారు. భారీ స్థాయిలో వంటకు నీటి వినియోగం అదే విధంగా అధిక మొత్తంలో ఉంటుంది. వంటకు వినియోగించగా వచ్చే వృథా నీటిని రీసైక్లింగ్‌ ద్వారా ప్రతిరోజూ లక్షా 50 వేల లీటర్ల నీటిని శుద్ధి చేస్తున్నారు. ఇలా శుద్ధి చేసిన నీటితో మొక్కలు పెంపకం, వంటగదిని కడగడానికి వినియోగిస్తున్నారు. నీటి పొదుపు నినాదాన్ని విధానంగా మార్చుకున్న అక్షయ పాత్ర ఫౌండేషన్‌ కృషి అభినందనీయం.

ప్లాస్టిక్‌ వద్దు.. వెదురు ముద్దు!


పర్యావరణానికి ప్లాస్టిక్‌ చేస్తున్న హానిపై అవగాహనతో ప్రతి ఒక్కరూ దాని వినియోగంపై అనాసక్తి చూపుతున్నారు. ఇదే స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులు యూనివర్సిటీ ఆవరణలో ప్లాస్టిక్‌ చెత్తబుట్టల స్థానంలో వెదురుతో రూపొందించినవి ఏర్పాటు చేశారు. అన్ని విభాగాల విద్యార్థులు సంయుక్తంగా ‘లిటిల్‌ హ్యాండ్స్‌’ పేరుతో ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్థానికంగా వెదురుతో తయారు చేసే బుట్టలను సేకరించి చెత్తబుట్టలుగా వినియోగిస్తున్నారు. వీటిని శనివారం నుంచి వినియోగంలోకి తీసుకొచ్చారు. విశ్వవిద్యాలయంలో శనివారం కేంద్ర మానవ వనరుల విభాగం నియమించిన స్వచ్ఛత కమిటీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా బృందంలోని సభ్యులు విద్యార్థుల ప్రయత్నాన్ని అభినందించారు.

వరద ముంపులో కర్నూలు జిల్లా


ఎడతెరిపి లేకుండా అయిదు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్త్యవస్తమైంది. 118 గ్రామాల్లో దాదాపు 70 వేల మంది ప్రభావితమయ్యారు. 31 వేల హెక్టార్లలో పంట నీట మునిగింది.  ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం హెలికాప్టర్‌ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. నంద్యాల పట్టణంలో అధికారుతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వరదల్లో ఇళ్లు కొల్పోయిన బాధితులకు ప్రభుత్వం తరఫున నూతన గృహాలు నిర్మిస్తామని ప్రకటించారు.

విద్యార్థుల రక్షణకు వినూత్న ఆలోచన


తెలంగాణ వ్యాప్తంగా జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. బాధితుల్లో చిన్నారులే అధికం. ఈ నేపథ్యంలో జ్వరాల బారి నుంచి చిన్నారులను రక్షించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది సూర్యాపేటలో ఓ పాఠశాల. ఏకరూప దుస్తుల నిబంధనను సడలించి శరీరాన్ని పూర్తిస్థాయిలో కప్పిఉంచేలా వేసుకొని రావాల్సిందిగా విద్యార్థులకు సూచించింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను అలానే పంపుతున్నారు. పాఠశాల ఆవరణలో నీరు నిల్వకుండా చూస్తూ, తరచూ ఫాగింగ్‌ చేసేలా సొంతగా యంత్రాన్ని కొనుగోలు చేసింది యాజమాన్యం. తనవంతు బాధ్యతగా విద్యార్థుల ఆరోగ్య రక్షణకు పాఠశాల యాజమన్యం చేపట్టిన చర్యలను తల్లిదండ్రులు అభినందిస్తున్నారు.

బీర్ల పండగొచ్చింది!


జర్మనీలోని మ్యూనిచ్‌లో అక్టోబర్‌ ఫెస్ట్‌ మొదలైంది. జర్మనీ రాజు లుడ్‌విగీ వివాహ వేడుకల సందర్భంగా దాదాపు 186 ఏళ్ల క్రితం నుంచి దీన్ని జరుపుకొంటున్నారు. ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. బవారియన్‌ సంస్కృతికి ప్రతీకగా చేసుకునే ఈ వేడుకల్లో సంప్రదాయ వస్త్రాలు ధరించిన యువతీయువకులు బీర్లు తాగుతూ నృత్యాలు చేస్తారు.

జుంబారే.. తేజుంబరే..!


హైదరాబాద్‌: బాలీబీట్స్‌ పేరుతో జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన జుంబా డ్యాన్స్‌లో నగర యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. సినీ నటి తేజస్వి జుంబా డ్యాన్స్‌తో యువతను ఉర్రుతలూగించారు.

మూగబోయిన నిరసన కెరటం


సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమ సమయంలో పార్లమెంట్‌ ఆవరణలో నిరసన గళం వినిపించి దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌. రోజుకో వేషధారణతో ఆకట్టుకున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన వేషధారణలు మీకోసం..


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.