close

తాజా వార్తలు

మళ్లీ నేనే సీఎం: ఫడణవీస్‌

ముంబయి: మహారాష్ట్రలో ‘భాజపా-శివసేన’ కలిసే పోటీ చేస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పష్టం చేశారు. ఇందులో అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదన్నారు. తమ కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుందని.. తానే ముఖ్యమంత్రి పదవి చేపడతానని వ్యాఖ్యానించారు. మొత్తం 288 స్థానాలకుగానూ 162 సీట్లలో భాజపా, 126 స్థానాల్లో శివసేన పోటీచేయనుందని వస్తున్న వార్తల్ని ఆయన కొట్టిపారేశారు. సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ‘ఇండియాటుడే కాంక్లేవ్‌’లో మాట్లాడుతూ శుక్రవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖాయమని శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. 

సీట్ల పంపకం విషయంలో 50-50విధానాన్ని పాటించాలని శివసేన డిమాండ్‌ చేస్తోందన్న ఊహాగానాలపై మాట్లాడుతూ.. ఇరుపార్టీలకు ఆమోదయోగ్యమైన నిర్ణయమే ఉంటుందని ఫడణవీస్‌ చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సేన మంత్రుల మద్దతుతో తీసుకున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిలో వారి భాగస్వామ్యం ఉంటుందన్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే విషయంపై పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఉద్దవ్‌ ఠాక్రే కుమారుడు, యువసేన అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలపై స్పందిస్తూ.. శివసేన పార్టీ వర్గాలు దీనిపై నిర్ణయం తీసుకుంటాయన్నారు.

మహారాష్ట్రలో అక్టోబరు 21న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 27న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అక్టోబరు 4తో నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తుంది. అక్టోబరు 5న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబరు 7 చివరి  రోజు. అక్టోబరు 21న ఎన్నికలు నిర్వహించి, అక్టోబరు 24న ఫలితాలు ప్రకటించనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
dr madhu
Saket Pranamam
besttaxfiler
tsmbanner
VITEEE 2020

Panch Pataka

దేవతార్చన