
తాజా వార్తలు
మేకల మందపై వీధి కుక్కలు తరచూ దాడులు చేసి ప్రాణాలు తీస్తుంటాయి. కుక్కల దాడుల్లో మేకలు, గొర్రెలు మృతి చెందిన ఉదంతాలు తరచూ చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఓ శునకం మాత్రం ఇందుకు విభిన్నం. అర్థవీడు మండలం కొత్తూరులో కనిపించే దృశ్యాన్ని చూసిన వారు ఆశ్చర్యానికి లోనవుతారు మరి. ఇక్కడ కొండయ్య అనే జీవాల కాపరికి చెందిన మేక రెండు పిల్లలకు జన్మనిచ్చి కొద్దిరోజులకే అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సంఘటన పది రోజుల క్రితం చోటుచేసుకుంది. తల్లి మృతితో మేక పిల్లలకు పాలు లేకపోయాయి. వాటి ఆకలి బాధను మేకల మందకు కావలి కాసే శునకం గుర్తించింది కాబోలు. మీ ఆకలి తీర్చే అమ్మను నేనవుతానంటూ ముందుకొచ్చింది. పది రోజుల నుంచి రెండు మేక పిల్లలకు ఉదయం.. సాయంత్రం వేళల్లో పాలిచ్చి ఆకలి బాధను తీరుస్తూ తల్లి ప్రేమను పంచుతోంది. గతంలోనూ ఒక మేక పిల్లకు ఇదే శునకం పాలిచ్చి పెంచినట్టు కాపరి కొండయ్య తెలిపారు. - న్యూస్‌టుడే, అర్థవీడు
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వదిలేశారు..
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
