
తాజా వార్తలు
హైదరాబాద్: పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్షల మెరిట్ జాబితాను, కటాఫ్ మార్కులను తక్షణమే ప్రకటించాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ మేరకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోలీసు కానిస్టేబుళ్ల నియామక పరీక్షలో ఉత్తీర్ణులైన 90వేల మంది అభ్యర్థులు మెరిట్ జాబితా, కటాఫ్ మార్కుల కోసం వేచి చూస్తున్నారన్నారు. పోలీసు శాఖలో 16,926 పోస్టుల భర్తీకి గతేడాది మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసినా.. ఇప్పటి వరకు ప్రక్రియ పూర్తి చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరీక్షకు హాజరైన నిరుద్యోగ యువత ప్రస్తుతం సొంత ఊళ్లకు వెళ్లలేక హైదరాబాద్‌లోనే ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఫలితాల విషయంలో పోలీసు నియామక బోర్డును సంప్రదించినా, సహాయ కేంద్రం ద్వారా తెలుసుకునేందుకు యత్నించినా సరైన స్పందన రాలేదని బాధిత నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషయం తన దృష్టికి రాగానే ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా.. నెల గడిచినా సమాధానం లేదని వివరించారు. సమస్య తీవ్రతను అర్థం చేసుకుని తక్షణమే ఫలితాలు విడుదలకు ఆదేశించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
