
తాజా వార్తలు
ఒడిశా: మనిషి ఎలాగుంటేనేం? మనసు గొప్పదని చాటుకున్నారు... భువనేశ్వర్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ రాణి కిన్నర్! ఎన్నో అడ్డంకులు, అవమానాలు ఎదురైనా... ఆత్మవిశ్వాసంతో తన జీవితాన్ని తానే నిర్మించుకున్నారు. ఉబర్ డ్రైవరుగా చేరి, ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించారు. చాలామంది ట్రాన్స్జెండర్ల మాదిరే రాణి కూడా మొదట రైళ్లలో యాచించేవారు. కానీ ఒక రోజు అంతర్మథనం మొదలైంది. ‘ఏంటీ జీవితం! నేనెందుకిలా బతకాలి? అందరిలా కష్టపడి ఎందుకు బతకకూడదు?’ అని ఆలోచన వచ్చింది. అలా ఓ చికెన్ ఫాంలో చిన్న ఉద్యోగం సంపాదించారు రాణి. తర్వాత డ్రైవింగ్‌పై మక్కువతో ఆటో నడపడం నేర్చుకున్నారు. కానీ... తన ఆటోలో కూర్చుని ప్రయాణించేందుకు చాలామంది మొగ్గు చూపేవారు కాదు. దీంతో రాణి ఉబర్ క్యాబ్స్‌లో డ్రైవర్‌గా చేరారు. తన చోదక నైపుణ్యంతో ప్రయాణికుల నుంచి ఫీడ్‌బ్యాక్ రూపంలో ఫైవ్‌స్టార్ రేటింగ్ సాధించారు. తనలా గౌరవంగా బతికేందుకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లను ప్రోత్సహిస్తున్నారు కూడా!
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- పథకం ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్
- వాంఖడేలో రికార్డుల మోత!
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఎన్‌కౌంటర్‌పై సుప్రీం విచారణ కమిషన్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
