close

తాజా వార్తలు

వెనిస్‌ను తలపిస్తోన్న హైదరాబాద్‌.. చిత్రమాలిక 

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌ నగరంలో గురువారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. సుమారు 14 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అంచనా. వర్షపునీటితో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. బేగంపేట, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్‌, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వరద నీటి తీవ్రత అధికంగా ఉంది. ఎన్డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత రెండు రోజులు కురిసిన కుండపోత వర్షంతో నగరంలోని పలు వీధులు ఇటలీలోని వెనిస్‌ నగరాన్ని తలపించాయి. కొన్ని చోట్ల ఎటు చూసినా నీరే ఉండటంతో నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల జీవనం స్తంభించింది. ఏకధాటిగా కురిసిన ఈ వాన ధాటికి హైదరాబాద్‌ జంటనగరాల్లోని పలు చోట్ల పరిస్థితి ఎలా ఉందో తెలిపే చిత్రాలివే.. 

మల్కాజ్‌గిరిలోని తూర్పు ఆనంద్‌బాగ్‌లో వరదనీటిలో చిక్కుకున్న జనం.. సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యం 


 సికింద్రాబాద్‌ ప్యాట్నీ నగర్‌లో నడుము లోతు నీటిలో ప్రజల అవస్థలివీ.. 


 సికింద్రాబాద్‌ ప్యాట్నీనగర్‌లో వంట గదిలో చేరిన వరదనీరు.. 


 మల్కాజ్‌గిరి వీధుల్లో భారీగా చేరిన వరదనీరు.. వర్షం వస్తే ఇవే అవస్థలు!



 వరద నీటి ముంపులో బేగంపేటలోని చికోటి గార్డెన్స్‌లోని చర్చి 



 సికింద్రాబాద్‌లోని స్వామి నారాయణ ఆలయం ముందు భారీగా చేరిన వరదనీరు 



 బేగంపేటలోని దేవనార్‌ అంధుల పాఠశాల వద్ద ఇదీ పరిస్థితి!



 బేగంపేటలోని మయూరి మార్గ్‌లో ఇళ్లలోకి చేరిన వరదనీరు 



 కేపీహెచ్‌బీ ఆర్వోబీ వద్ద వరద నీటిలో వాహన చోదకులు ఇలా.. 


చెరువును తలపించేలా.. మాదాపూర్‌లో డెలాయిట్‌ సంస్థ కార్యాలయం వద్ద పరిస్థితి!


 రాజ్‌భవన్‌ రోడ్‌లో గురువారం అర్ధరాత్రి భారీగా కురుస్తున్న వర్షం


చెరువును తలపిస్తున్న రాజ్‌భవన్‌ రహదారి



 తిరుమలగిరి చెరువుకు పోటెత్తిన వరద.. ముంపుకు గురైన ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ కాలనీ



 రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో వరద ముంపుకు గురైన అపార్ట్‌మెంట్‌ 



 నాలా చెరువైంది.. అశోక్‌నగర్‌లో వరద పరిస్థితి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.