
తాజా వార్తలు
హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో సీపీఐ మద్దతు కోరేందుకు తెరాస ఎంపీలు కె.కేశవరావు(కేకే), నామా నాగేశ్వరరావు, రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్‌కుమార్ ఆ పార్టీ రాష్ర్ట కార్యాలయానికి వెళ్లారు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, నేతలు పల్లా వెంకట్ రెడ్డి, అజీజ్ పాషా, కూనంనేని సాంబశివరావుతో తెరాస నేతలు మంతనాలు జరిపారు. అరగంటకు పైగా ఇరు పార్టీల నేతలు చర్చించారు.
తోక పార్టీలు అనుకోవడం తప్పు: కేకే
తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీపీఐ నేతలను కలిశామని కేకే చెప్పారు. చర్చల అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. హుజూర్నగర్ ఎన్నికలో సీపీఐ పోటీ చేయడం లేదని తెలిసిందని.. అందుకే తమకు మద్దతు ఇవ్వాలని కోరేందుకు వచ్చినట్లు తెలిపారు. తమ మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. యురేనియం తవ్వకాల నిలిపివేత, పోడు భూములకు పట్టాలు, రెవెన్యూ చట్టంలో తీసుకొచ్చే మార్పులపై తమను సంప్రదించాలనే డిమాండ్లను సీపీఐ నేతలు తమ ముందుంచారన్నారు. ఆ పార్టీ నేతలు తమతో మాట్లాడిన విధానం చూస్తే పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోందని కేకే విశ్వాసం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీలు అంటే తోక పార్టీలు అనుకోవడం తప్పని ఆయన వ్యాఖ్యానించారు.
మేం పాత మిత్రులమే: చాడ
తాము పాత మిత్రులమేనని.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేశామని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా తెరాస ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ మధ్య దూరం పెరిగిందని చెప్పారు. ఉద్యమ సెంటిమెంట్‌ను కాపాడేందుకే గతంలో మద్దతిచ్చామని గుర్తుచేశారు. అక్టోబర్ 1న జరిగే కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వదిలేశారు..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
