close

తాజా వార్తలు

‘చిత్ర’ వార్తలు

టాటూకి కాదు ఏదీ అనర్హం!


దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు వైభవంగా జరుపుకొంటున్నారు. గుజరాత్‌ సూరత్‌లోని కొందరు మహిళలు వేడుకల్లో భాగంగా శరీరంపై టాటూలు వేయించుకున్నారు. అవీ సాధారణ టాటూలు కాదు. నవరాత్రి చిత్రాలతో పాటు చంద్రయాన్‌-2, హౌడీ-మోదీ, ఆర్టికల్‌ 370 రద్దు వంటి ప్రస్తుత ట్రెండింగ్‌ అంశాలను తమ వీపుపై టాటూలా వేయించుకున్నారు. 

పట్నా వీధుల్లో జలవిలయం


భారీవర్షాలు, వరదలతో బిహార్‌ రాజధాని పట్నా సతమవుతోంది. రాజేంద్రనగర్‌ ప్రాంతంలో నివాసముంటున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీ, కుటుంబ సభ్యులను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సోమవారం మధ్యాహ్నం రక్షించాయి. భారీ వర్షాల కారణంగా గత మూడురోజులుగా సుశీల్‌ కుమార్‌ ఇంటికే పరిమితమయ్యారు. వర్షాలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 మంది మృతిచెందారు. రాజేంద్ర నగర్ ప్రాంతం, రామకృష్ణ నగర్, కంకర్‌బాగ్, బోరింగ్ రోడ్, నాలా రోడ్, గాంధీ మైదాన్ ప్రాంతాల్లో వరద ప్రమాదకరస్థాయిలో ఉంది. ఎన్టీఆర్‌ఎఫ్‌, మున్సిపల్‌ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

వరదల్లో ఫొటోషూట్‌!


పట్నా వరదల్లో మోడల్‌తో ఫొటోషూట్‌ చేశాడు ఓ యువ ఫొటోగ్రాఫర్‌. పట్నా నిఫ్ట్‌ విద్యార్థిని అదిత్‌ సింగ్‌ వరదతో నిండిన వీధుల్లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తీసింది మ్యావ్‌ స్టూడియో అధినేత సౌరభ్‌ అనురాజ్‌.  'మెర్మైడ్ ఇన్ డిజాస్టర్' పేరుతో తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ఫొటో షూట్‌ను నెటిజన్లు కొందరు అభినందించగా మరికొందరు విమర్శించారు. 

విద్యార్థులతో గాంధీజీ!


మహాత్మ గాంధీ 150 జయంతి సందర్భంగా చెన్నైలోని ఓ పాఠశాల వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. శిరస్త్రాణధారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్‌ ధరించిన విద్యార్థులు మహాత్మగాంధీ ఆకారంలో కూర్చొని ‘సేవ్‌ లైఫ్‌’ నినాదాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి గాంధీజీ వేషధారణలో వచ్చిన వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

వైభవంగా నవరాత్రులు ప్రారంభం


దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ముంబయిలో నిర్వహించిన వేడుకల్లో బాలీవుడ్‌ తారలు తాప్సి, భూమి పెడ్నేకర్‌, గాయని ఫల్గుణి పాథక్‌ సందడి చేశారు. గుజరాత్‌లో వేడుకలను సీఎం విజయ్‌ రుపానీ అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. సంప్రదాయ నృత్యం ‘గార్బా’ ఆడేందుకు విదేశాల నుంచి పలువురు ఔత్సాహికులు అహ్మదాబాద్‌ తరలివచ్చారు.  

‘క్యాపిటల్‌’ మూత!


రిలయన్స్‌ అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌‌) వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం ముంబయిలో జరిగింది. రిలయన్స్‌ క్యాపిటల్‌ ఇకపై రుణాలు ఇచ్చే వ్యాపారంలో ఉండదని సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ ప్రకటించారు. సమావేశానికి అనిల్‌ తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.