close

తాజా వార్తలు

హైదరాబాద్‌లో భారీవరద:కొట్టుకెళ్లిన వ్యక్తి

హైదరాబాద్‌: భాగ్యనగరంలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడ నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ఇటీవల యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్‌ వద్ద ఓ వృద్ధుడు వరదనీటిలో కొట్టుకెళ్లిన వీడియో బయటకొచ్చింది. సదరు వ్యక్తి.. కొట్టుకుపోతున్న ద్విచక్ర వాహనాన్ని పట్టుకునే క్రమంలో నియంత్రణ కోల్పోయాడు. అప్పటికే వరదనీరు భారీగా వస్తుండటంతో ఆ ప్రవాహంలో కొట్టుకెళ్లాడు. అయితే ఆ వ్యక్తి ఎవరు?ఆ తర్వాత ఆయన సురక్షితంగా బయట పడ్డారా?లేదా? అనే విషయాలు మాత్రం తెలియరాలేదు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.