close

తాజా వార్తలు

ఆ కుటుంబాలకు రూ.10లక్షల చొప్పునఅందజేత

విశాఖ: తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో గల్లంతై మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్‌ బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కులు అందించారు. విశాఖ జిల్లాకు చెందిన 9 కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున మంత్రి అందజేశారు. గోదావరి నదిలో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వల్లే బోటు వెలికితీత పనులు ఆలస్యం అవుతున్నాయని మంత్రి వివరించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై పోలీసులు, విజిలెన్స్‌ అధికారుల పర్యవేక్షణలో బోటు ప్రయాణాలు ఉంటాయని స్పష్టం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.