close

తాజా వార్తలు

బతికి సాధించాలి.. ఆత్మహత్యలొద్దు: చంద్రబాబు

నెల్లూరు: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఇద్దరు కార్మికులు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడటం తనను కలచివేసిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గాల సమీక్షలో మాట్లాడుతూ కార్మికుల ఆత్మహత్యలపై స్పందించారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావన్నారు. జీవితం ఎంతో విలువైనదని.. బతికి సాధించాలే తప్ప బలవన్మరణం పరిష్కారం కాదని సూచించారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని చంద్రబాబు ఆర్టీసీ కార్మికులను కోరారు. కార్మికులంతా సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.