close

తాజా వార్తలు

‘వివేకా హత్య ముద్దాయిలెవరో జగన్‌కు తెలుసు’

తెదేపా నేత వర్ల రామయ్య వ్యాఖ్య

గుంటూరు: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో ప్రభుత్వం తాత్సారం ఎందుకు చేస్తోందని తెదేపా సీనియర్‌ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ఈ హత్య కేసును మసిపూసి మారేడుకాయ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వివేకా హత్య కేసులో అసలు ముద్దాయిలను దాచి హత్యకు సంబంధం లేనివారిని బయటకు చూపిస్తున్నారని విమర్శించారు. ఈ కేసులో అసలు ముద్దాయిలెవరో సీఎం జగన్‌, వివేకా కుమార్తె సునీతకు తెలుసని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. తెదేపా ప్రభుత్వం హయాంలో ఈ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేసిన జగన్‌, సునీత.. ఇప్పుడెందుకు ఆ దర్యాప్తు కోరడంలేదని ప్రశ్నించారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.