close

తాజా వార్తలు

చేనేత కుటుంబాలకు ఏపీ సర్కార్‌ శుభవార్త

ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ భేటీ ముగిసింది. రాష్ట్రంలో కొత్త సంక్షేమ పథకాలకు విధివిధానాలపై ఈ భేటీలో చర్చించారు. చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక సాయంపై ప్రధానంగా చర్చించారు. ‘వైఎస్‌ఆర్‌ చేనేత నేస్తం’ పేరుతో ఏటా రూ.24వేలు చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం అమలుకు రూ.216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఏటా డిసెంబర్‌ 21న చేనేత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకు ద్వారా అందించనున్నారు. ఒకే విడతలో రూ.24వేలు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 90వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలపై మంత్రి పేర్ని నాని ఈ మధ్యాహ్నం 3గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.