close

తాజా వార్తలు

అభిజిత్‌వి వామపక్ష భావాలు: గోయెల్‌

దిల్లీ: అర్థశాస్త్రంలో నోబెల్‌ సాధించిన అభిజిత్ బెనర్జీ అనుసరిస్తున్న విధానాలన్నీ వామపక్ష భావజాలంతో కూడుకున్నవని.. భారతదేశ ప్రజలు ఆయన విధానాలను తిరస్కరించారని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ అన్నారు. ‘అభిజిత్ బెనర్జీ నోబెల్‌ బహుమతి సాధించారు. అందుకు ఆయన్ను అభినందిస్తున్నాను. ఆయన ఆలోచనలు, అనుసరిస్తున్న విధానాలన్నీ వామపక్ష భావజాలంతో ఉన్నాయి. దేశ ప్రజలు ఆయన ఆలోచనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అభిజిత్ బెనర్జీ నోబెల్‌ బహుమతి పొందడం ఒక భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. అలాగని ఆయన చెప్పేవన్నీ అనుసరించాలని లేదు. ముఖ్యంగా ప్రజలు ఆయన విధానాలను వ్యతిరేకిస్తున్న సమయంలో ఆయన్ను సమర్థించలేం’ అని గోయెల్‌ వ్యాఖ్యానించారు.

‘లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్‌వైఏవై (కనీస ఆదాయ పథకం) పథకాన్ని ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అపజయాన్ని మూటగట్టుకుంది. అభిజిత్‌ బెనర్జీ నోబెల్‌ అందుకున్న సమయంలో ఎన్‌వైఏవై పథకానికి ఆయన అందించిన సలహాలు, సూచనలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్ ద్వారా కొనియాడారు. కాంగ్రెస్‌ పరాజయం పాలైందంటే పరోక్షంగా ఆ పథకం కూడా ప్రజల్లోకి వెళ్లలేదని స్పష్టంగా తెలుస్తోంది. ప్రజలు ఆయన విధానాలను తిరస్కరించారని చెప్పడానికి ఇదొక నిదర్శనం’ అని గోయెల్‌ పేర్కొన్నారు.

భారత బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోబోతుందని అభిజిత్‌ గతంలో హెచ్చరించారు. తక్షణమే బ్యాంకింగ్ రంగానికి ఉద్దీపన చర్యలు చేపట్టాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.