close

తాజా వార్తలు

జగన్‌ గారూ..ఏమిటీ డ్రామాలు?:దేవినేని

విజయవాడ: గత నాలుగున్నర నెలల్లో పెండింగ్‌ బిల్లులు ఎవరెవరికి ఇచ్చారో చెప్పే ధైర్యం సీఎం జగన్‌కు ఉందా అని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనులు ఒకే గుత్తేదారుకు దక్కాయని.. వెలిగొండ పనుల టెండరింగ్‌లో రియాలిటీ షో జరుగుతోందని ఆయన ఆరోపించారు. విజయవాడలోని తెదేపా కార్యాలయంలో దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. వెలిగొండ ఒకటో టన్నెల్‌ పనులు చేసేవారికే రెండో టన్నెల్‌ అప్పగించారని విమర్శించారు. సీఎం జగన్‌ ఇంట్లో కూర్చునే డ్రామాలు నడుపుతున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు పనులు హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాయన్నారు. 

ప్రాజెక్టు టెండర్లలో ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని ఉమ అన్నారు. బోటు మునిగి నెల రోజులు దాటినా బయటకు తీయలేకపోయారని . ఆ ఘటన బాధితుల ఆక్రందనలు ఈ ప్రభుత్వానికి వినబడటం లేదా అని ప్రశ్నించారు. బోటు మునిగి 35 ఐదు రోజులే అయిందని.. రాష్ట్రం మునిగి నాలుగున్నర నెలలు అయిందంటూ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారని ఉమ వ్యాఖ్యానించారు. గోదావరిలో బోటు మునిగిన స్థలం వద్ద కూడా 144 సెక్షన్‌ పెట్టిన ఘనత వైకాపా ప్రభుత్వానిదన్నారు. రైతుభరోసా పథకాన్ని ఎన్ని లక్షల కుటుంబాలకు వర్తింపజేశారని ఆయన ప్రశ్నించారు. ఆధార్‌ కార్డు, వెబ్‌ల్యాండ్‌ వివరాల పేరుతో రైతులను తిప్పుతున్నారని ఆక్షేపించారు. సీఎం జగన్‌ దిల్లీ చుట్టూ తిరుగుతున్నారని.. అక్కడ ఏం చేస్తున్నారో మీడియాకు ఎందుకు వెల్లడించడడం లేదని దేవినేని ప్రశ్నించారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.