close

తాజా వార్తలు

కార్మికులకు అండగా గళమెత్తనున్నజనసేనాని

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ కార్మికుల బాధలపై జనసేనాని పవన్‌కల్యాణ్‌ గళమెత్తనున్నారు. ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది కోసం లాంగ్‌ మార్చ్‌ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహరాల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధిలేక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్న నిర్మాణరంగ కార్మికుల బాధలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో పవన్‌ కల్యాణ్‌ భారీ పాదయాత్ర చేపట్టనున్నారు. నవంబర్‌ 3 లేదా 4 తేదీల్లో విశాఖలో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. సీపీఎస్‌ విధానం రద్దు చేస్తామన్న వైసీపీ ఎన్నికల హామీ, రాజకీయ కక్షలతో అక్రమ కేసులు నమోదు చేయడం, తాగుడు పెంచేలా ప్రభుత్వ మద్యం విధానం, అవుట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తొలగింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలనే అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. అంతేకాకుండా పార్టీ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యం కల్పించడం, పార్టీ నిర్మాణంలో స్వల్ప మార్పులు చేయడం, యువ నాయకత్వాన్ని బలోపేతం చేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంపై సమావేశం సాగింది. ర్యాలీ నేపథ్యంలో పార్టీ నేత తోట చంద్రశేఖర్‌ నేతృత్వంలో పాదయాత్ర నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, తోట చంద్రశేఖర్‌, రాపాక వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.