close

తాజా వార్తలు

పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి: జగన్‌

అమరావతి: సాధారణ ప్రజల గౌరవం, మన్ననలు పొందేలా పని చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పిలుపునిచ్చారు. పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఆయన కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీసు సేవలను సీఎం కొనియాడారు.  విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసులు అమరులయ్యారని గుర్తు చేశారు. దేశం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలర్పించారని అన్నారు. వారానికి ఒకరోజు కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలన్న ఉద్దేశంతో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా పోలీసులకు వీక్లీఆఫ్‌ ప్రకటించినట్లు తెలిపారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు సంపూర్ణంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ సమన్యాయం జరగాలన్న సీఎం.. విధినిర్వహణలో హోంగార్డు మరణిస్తే రూ.5 లక్షలు పరిహారం చెల్లిస్తామన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.