close

తాజా వార్తలు

దెయ్యాలున్నాయని నిరూపిస్తే రూ.50వేలు!

భువనేశ్వర్‌: దెయ్యాలు, భూతాలు, మంత్రవిద్యలు వంటి మూఢనమ్మకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓడిశాలోని గంజాం జిల్లా కలెక్టర్‌ వింత ప్రకటన చేశారు. దెయ్యాలు ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే వారికి రూ.50వేలు నగదు బహుమతి ఇస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా గంజాం కలెక్టర్‌ అమృత కులంగే మాట్లాడుతూ.. ‘నాకు తెలిసి నేను దెయ్యాలు లేవని నమ్ముతున్నా. ఒకవేళ అవి ఉన్నాయని ఎవరైనా తమ మంత్రవిద్యల ద్వారా నిరూపిస్తే వారికి నేను రూ.50వేలు ఇస్తాను. ఇటీవల అనారోగ్యం పాలైన కొందరి కుటుంబసభ్యులు తమ బంధువులు మంత్ర విద్యలతో అనారోగ్యానికి గురిచేస్తున్నారని భావిస్తున్నారు. అది తప్పు, అలాంటి విద్యల ద్వారా ఎవరూ ఎవర్నీ ఏం చేయలేరు. దీంతో అనారోగ్యం ఉన్న వ్యక్తిని సైతం వైద్యుడి వద్దకు తీసుకెళ్లకుండా మంత్రగాళ్ల వద్దకే తీసుకువెళ్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రజా సమస్యల సమావేశంలో తరచూ ఈ ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి అందుకే ఈ ప్రకటన చేశాం’ అని వెల్లడించారు. 

తాజాగా జిల్లాలో ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. మంత్ర పూజలు చేస్తున్నారనే నెపంతో గోపాపూర్‌ గ్రామంలో ఆరుగురు వ్యక్తులపై కొందరు దాడి చేసి కొట్టి పళ్లు పీకేశారు. జగన్నాథ్‌ప్రసాద్‌ గ్రామంలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనల్లో పోలీసులు గోపాపూర్‌లో 35, జగన్నాథ ప్రదలో 10 మందిని అరెస్టు చేశారు. కాగా కలెక్టర్‌ చేసిన ఈ ప్రకటనను అక్కడి మానవ హేతువాద సంస్థ స్వాగతించింది. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.