
తాజా వార్తలు
అమరావతి: నానాటికీ తీవ్రతరమవుతున్న ఇసుక సమస్య ఆందోళన రేపుతోంది. దీంతో అధికార పార్టీ నేతలకు నిరసన సెగ తాకింది. మంత్రి బొత్స సత్యనారాయణను గుంటూరులో కార్మికులు నిలదీశారు. తెనాలిలో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యల ఘటనపై వైకాపా ఎమ్మెల్యేతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు పండగ వేళ భవన నిర్మాణ కార్మికుల ఇళ్లలో నెలకొన్న విషాదానికి జగన్ సర్కారే బాధ్యత వహించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం పర్యటించిన మంత్రి బొత్స సత్యనారాయణకు భవన నిర్మాణ కార్మికుల నుంచి నిరసన సెగ తగిలింది. పూలకుట్ల కూడలి వద్ద కార్మికులు నిలదీశారు. ఇసుక కొరత కారణంగా పని దొరక్క ఇబ్బందులు పెడుతన్నామని, ఓట్లు వేసింది ఇందుకేనా? అని ప్రశ్నించారు. మరోవైపు భవన నిర్మాణ కార్మికుడి ఆత్మహత్యను పోలీసులు పక్కదోవ పట్టిస్తున్నారంటూ గుంటూరు జిల్లా తెనాలిలోని సంగెం జాగర్లమూడిలో స్థానికులు ఆందోళనకు దిగారు. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న తాపీ మేస్త్రీ బ్రహ్మాజీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైకాపా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ బాధిత కుటుంబానికి పరామర్శించేందుకు రాగా.. తెదేపా, జనసేన పార్టీల నేతల ఆందోళన వాగ్వాదానికి దారితీసింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఆత్మహత్య ఘటనపై రాజకీయాలు తగవని హితవు పలికారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5లక్షల పరిహారం, ఓ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
మరోవైపు వైకాపా నేతలే ఇసుకను అమ్ముకుంటున్నారంటూ వస్తున్న విమర్శలను నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తోసిపుచ్చారు. గత ప్రభుత్వ తప్పిదాలు, ప్రకృతి సహకరించకపోవడమే కారణమని పేర్కొన్నారు. త్వరలోనే సమస్య సమసిపోతుందని పేర్కొన్నారు. ఇసుక కొరత వల్ల పనుల్లేక కార్మికులు ఆత్మహత్యకు పాల్పడడం తనను ఆవేదనకు గురిచేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పండగవేళ మేస్త్రీల మృతి కలచి వేసిందన్నారు. ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంపై పోరాడతామన్నారు. తెదేపా జాతీయ కార్యదర్శి లోకేశ్, సీపీఐ నేత రామకృష్ణ సైతం ఇసుక కొరతపై ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వానిదే బాధ్యత అని విమర్శించారు
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఎన్కౌంటర్తో న్యాయం జరగలేదు
- ఆ కిరాతకులు ఎలా దొరికారు?
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్కౌంటర్పై హైకోర్టులో అత్యవసర విచారణ
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆ రెండు రోజులూ ఏం జరిగింది?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
