
తాజా వార్తలు
హైదరాబాద్: ఆర్టీసీ సంక్షోభంపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాలతో చర్చల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. రేపు కోర్టుకు నివేదించాల్సిన అంశాపై కూడా చర్చించారు.
ఆర్టీసీ యాజమాన్యానికి, కార్మిక సంఘాల నాయకులకు మధ్య శనివారం జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చల్లో ఎలాంటి పురోగతీ కనిపించలేదు. అన్ని డిమాండ్లనూ చర్చించాలని యూనియన్ నాయకులు కోరగా.. కోర్టు సూచించిన మేరకు 21 అంశాలపైనే చర్చిస్తామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. అధికారులు మళ్లీ చర్చలకు పిలుస్తారని ఎదురుచూసి వెళ్లిపోతున్నామని ముందుగా విలేకరులతో మాట్లాడిన కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు
రెండోరోజుకు చేరిన నిరవధిక దీక్ష
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కూనంనేని సాంబశివరావు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండోరోజుకు చేరింది. ఈ దీక్షకు సీపీఐ నేత నారాయణ, తెదేపా నేతలు ఎల్. రమణ, రావుల, కాంగ్రెస్ నేత వీహెచ్ తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ రవాణా మంత్రిగా పనిచేసిన సీఎం ఆర్టీసీ కార్మికులపై ఈ విధమైన వైఖరి సరికాదని పేర్కొన్నారు. సెల్ఫ్ డిస్మిస్ పేరిట సీఎం కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మరోనేత రావుల మాట్లాడుతూ.. నిన్న జరిగిన చర్చలు అసంబద్ధమైనవన్నారు. ఉప ఎన్నికల్లో అధికారపార్టీలు గెలవడం గొప్ప విషయం కాదన్నారు. సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ.. చర్చలపేరిట పిలిచి ఆర్టీసీ నేతల సెల్ఫోన్లు లాక్కున్నారన్నారు. కార్మికులు లేవనెత్తే సమస్యలపై ప్రభుత్వాలు కూలంకషంగా చర్చించాలన్నారు. కార్మికులపై తప్పుడు సంకేతాలు ఇవ్వడానికే ఈ చర్చలు నిర్వహించారని ఆరోపించారు. తాము చర్చలకు పిలిచినా కార్మికులు సహకరించడంలేదని చెప్పేందుకు ఇలా చేశారన్నారు. నేటి నుంచి నిరసనలను మరింత పెంచుతామని నారాయణ తెలిపారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
