close

తాజా వార్తలు

గుజరాత్‌లో 3500వంటకాలతో నైవేద్యం

వడోదర: గుజరాత్‌ నూతన సంవత్సర వేడుకలను సోమవారం ఆ రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా వేడుకలను ఘనంగా నిర్వహించే వడోదరలోని స్వామి నారాయణ్‌ ఆలయం ఈసారి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘అన్నకూట్‌ పూజ’ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 3500 రకాల ఆహార పదార్థాలను స్వామి వారికి నైవేద్యంగా అర్పించారు. ఈ పిండివంటలను అమర్చిన తీరు భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. కృత్రిమ కోనేరు మధ్యలో భారీ కమలాన్ని ఏర్పాటు చేశారు. మధ్యలో స్వామివారి విగ్రహాన్ని ఉంచి ఆ కమలంపై వివిధ రకాల కేకుల్ని అమర్చారు. అన్ని కేకులు కనిపించే విధంగా ఆ కమలం తిరిగేలా ఏర్పాట్లు చేశారు. దీపకాంతుల మధ్య ఒక క్రమ పద్ధతిలో అమర్చిన వంటకాలు ఆకట్టుకున్నాయి. 3500 రకాల మిఠాయిలు, ఇతర పిండివంటలు.. చూస్తేనే నోరూరిస్తున్నాయి.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.