
తాజా వార్తలు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలు ఆర్టీసీ కార్మికులపై ఏమాత్రం కూడా ప్రభావం చూపలేకపోతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. హైకోర్టు అక్షింతలు వేసినా సీఎం పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీ సమ్మె సమాచారాన్ని పార్టీ పరంగా, గవర్నర్ ద్వారా కేంద్రానికి వెళ్తోందని చెప్పారు. మిలియన్ మార్చ్, సాగరహారం నిర్వహించకముందే ఆర్టీసీ సమ్మె సమస్యను పరిష్కరిస్తే మంచిదని.. లేకుంటే ప్రభుత్వ పతనం ఖాయమన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తే లీజు వ్యవహారాలన్నీ తిరగతోడుతామని చెప్పారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
