
తాజా వార్తలు
రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపణ
దిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ స్పైవేర్ భారత్‌లోని కొందరి ఫోన్లలో వాట్సప్‌లోకి చొరబడిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ స్పైవేర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫోన్లోకి కూడా చొరబడిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ఇప్పటివరకూ ఈ స్పైవేర్ ముగ్గురు ప్రతిపక్ష నాయకుల ఫోన్లలో చొరబడిందని అన్నారు. ప్రియాంక సహా, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్‌ల ఫోన్లను ఈ స్పైవేర్ పేరుతో ప్రభుత్వమే హ్యాకింగ్ చేయించిందని సుర్జేవాలా ఆరోపించారు. ఇందుకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
‘‘వాట్సప్ హ్యాకింగ్‌కు గురైన వారందరికీ ఆ సంస్థ ఓ సందేశం పంపింది. ఇలాంటి మెసేజ్ ప్రియాంక కూడా అందుకున్నారు. ఆమె ఫోన్ కూడా హ్యాకింగ్‌కు గురైందని అందులో హెచ్చరించారు.’’ అని దిల్లీలో విలేకరులతో అన్నారు.
గత వారం ఈ స్పైవేర్ గురించి వాట్సప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్ఎస్వో వాట్సప్ సర్వర్లలోకి చొరబడి స్పైవేర్‌ను వ్యాప్తి చేస్తోందని వాట్సప్ వెల్లడించింది. భారత్‌కు చెందిన జర్నలిస్టులు, మానవ హక్కుల పోరాటకర్తలు, న్యాయవాదుల ఫోన్లకు ఈ ముప్పు ఉన్నట్లు వివరించింది.
వాట్సప్ సందేశాలపై నిఘా విధించడం చట్ట విరుద్ధమే కాకుండా సిగ్గుచేటని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా శనివారం మండిపడ్డారు. ఆ స్పైవేర్‌తో కేంద్రం ఈ నిఘా ఉంచుతోందని ఆమె ఆరోపించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
