
తాజా వార్తలు
హైదరాబాద్: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రమైన క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి తెల్లవారు జామునుంచే భక్తులు భారీగా తరలి వచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యన్నారాయణ స్వామి వారిని దర్శనానికి భక్తులు బారులుతీరారు. తెల్లవారు జాము నుంచే సత్యదేవుని వ్రత మండపాలు భక్తులతో నిండిపోయాయి. మరోవైపు ముమ్మరవరం మురమల్ల వీరేశ్వర స్వామికి ప్రత్యేక అభిక్షేం నిర్వహించారు. యానాం వద్ద గోదావరిలో నీరు తక్కువగా ఉండటంతో భక్తులు జల్లు స్నానాలు ఆచరించి గోదావరిలో దీపాలను వదిలారు. పశ్చిమగోదారి జిల్లా ఉండ్రాజవరం మండలంలో పురాతన శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి భక్తులు పాలాభిషేకాలు చేశారు. అనంతరం కోనేటిలో కార్తీక దీపాలు వదిలారు. తణుకు కపద్దీశ్వరాలయం, పాతవూరులోని సిద్ధేశ్వరస్వామి ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే మహిళలు ఆలయాల వద్ద కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం గోదావరి నది వద్ద సందడి నెలకొంది. గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వదిలారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లోని శివలింగాలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
