
తాజా వార్తలు
అబ్దుల్లాపూర్‌మెట్: దుండగుడి చేతిలో దారుణంగా సజీవ దహనమైన హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు మంగళవారం నాగోల్‌లోని శ్మశానవాటికలో జరగనున్నాయి. ఈ దారుణ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ అలీ స్పందించారు. నిందితునిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. విజయారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం అత్యంత దారుణచర్య అని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఈ సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. విజయారెడ్డిని హత్య చేసిన నిందితుడిని ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని పేర్కొన్నారు. విజయారెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
విధుల్లో ఉండగా పెట్రోల్ పోసి కాల్చడం దిగ్భ్రాంతికి గురిచేసిందని తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. కార్యాలయంలో రక్షణ లేకపోవడం దారుణమన్నారు. ఇది ఒక వ్యక్తి చేసింది కాదని, వాస్తవాలు బయటికి రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను చులకన చేయడం సరికాదని ఈ సందర్భంగా కోదండరాం పేర్కొన్నారు. రెవెన్యూ ఉద్యోగుల విధుల్లో మార్పులు చేర్పులు చేయడం అవసరమని తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. విజయారెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
మరోవైపు విజయారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్‌నేత వీహెచ్, టీఎన్జీవో సంఘం నేతలు తదితరులు తరలివచ్చారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- రివ్యూ: వెంకీ మామ
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
