
తాజా వార్తలు
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం విధించిన డెడ్లైన్లకు భయపడొద్దని తెలంగాణ ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కార్మికులు ధైర్యంగా ఉండాలని..అంతిమ విజయం కార్మికులదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐకాస నాయకులు ఓ ప్రకటన విడుదల చేశారు. కార్మికులెవ్వరూ యాజమాన్యానికి లేఖలు ఇవ్వొద్దని అందులో పేర్కొన్నారు. ఈ నెల 7న హైకోర్టు ఇవ్వబోయే తీర్పు కార్మికులకు అనుకూలంగా ఉండొచ్చని వారు అభిప్రాయపడ్డారు.
డిపో మేనేజర్‌పై దాడితో సంబంధం లేదు:ఆర్టీసీ ఐకాస
ఇవాళ ఉదయం నిర్మల్ జిల్లా భైంసాలో ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్దన్‌పై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆయకు స్వల్పగాయాలు కాగా..దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ దాడిని ఆర్టీసీ ఐకాస ఖండించింది. జానర్దన్పై ఆర్టీసీ కార్మికులు దాడి చేయలేదని, దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
