
తాజా వార్తలు
విజయనగరం: ఎన్నికల ప్రచారంలో అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమని జగన్ మరోసారి నిరూపించారని చెప్పారు. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
జిల్లాలో రూ.10వేల లోపు డిపాజిట్ చేసిన 57,941 మంది అగ్రిగోల్డ్ లబ్ధిదారులకు రూ.36.99కోట్ల చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ లబ్ధిదారులుగా ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మొదటి విడతగా ఇప్పుడు రూ.10వేలు, రెండో విడతలో మరో రూ.10వేలు ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తామని బొత్స వివరించారు. అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో గత ప్రభుత్వాలు మాట ఇచ్చి తప్పాయని.. తమ ప్రభుత్వం మాత్రం అధికారంలోకి రాగానే వారి సమస్యలను తీర్చేందుకు ముందుకొచ్చిందన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వదిలేశారు..
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
