
తాజా వార్తలు
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భాజపాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్వారీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన తమ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించింది.ముంబయిలోని ఓ హోటల్లో వాళ్లను ఉంచారు. శనివారం రాత్రి ఆదిత్య ఠాక్రే కూడా వారితోనే బస చేశారు. భాజపా ప్రభుత్వం ఏర్పాటు విషయమై శివసేన నేత సంజయ్ రౌత్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. గవర్నర్ నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘సీట్లెక్కువ గెలుచుకున్న పార్టీ కావడంతో గవర్నర్ భాజపాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమన్నారు. మెజార్టీ లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. మేం కూడా ఎక్కువ సీట్లే గెలుచుకున్నాం. భాజపా ప్రభుత్వాన్ని ఎలా నిలపగలదు? స్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఆ పార్టీకి ఉందా?. అవేమీ లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ఎలా చెప్పుకుంటోంది?. ఆ పార్టీ రాజకీయ వ్యాపారం చేస్తోంది. మా ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించడం బాధించింది. మా నాయకుడు వ్యాపారస్థుడు కాదు. మేమిక్కడ వ్యాపారమూ చేయడం లేదు. రాజకీయాలను వ్యాపార కోణంలో మేం ఏనాడూ చూడ లేదు. ఇప్పటికీ మేం మా నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే మాటకే కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు.
ఎన్సీపీ, కాంగ్రెస్‌ల గురించి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని ప్రతిపార్టీ స్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. ఇందుకు కాంగ్రెస్ కూడా అతీతం కాదు. ఆ పార్టీతో మాకే శత్రుత్వం లేదు. మా సిద్ధాంతాలు వేరు కావచ్చు. అంతేగానీ మా మధ్య ఎలాంటి వైరం ఉండదు. ఎన్నో సార్లు మేం భాజపాపై విమర్శలు గుప్పించాం. అలాగని వారితోనూ మేం గొడవలు పెట్టుకున్నట్లు కాదు. ఏ పార్టీకయినా అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రజల శ్రేయస్సే. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోతే శివసేన ఆ బాధ్యతలు తీసుకుంటుంది’ అని సంజయ్ రౌత్ అన్నారు.
అయోధ్య తీర్పు గురించి మాట్లాడుతూ..‘రామ మందిరం తీర్పు విజయం దేశం మొత్తానిదీ..ఏ ఒక్క పార్టీ ఘనతో కాదు. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీల వ్యక్తిగత అంశం కాదు. దేశప్రజల మనోభావాలకు సంబంధించింది. కాబట్టి ఏ పార్టీ ఈ తీర్పును చూసి జబ్బలు చరుచుకోకూడదు’ అని చురకలు అంటించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రఘురామ కృష్ణరాజువిందుకు రాజ్‌నాథ్‌సింగ్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
