close

తాజా వార్తలు

ప్రాణం తీసిన టిక్‌టాక్‌ వీడియో

కువైట్‌లో తూర్పుగోదావరి జిల్లా వాసి మృతి

రాజోలు, న్యూస్‌టుడే: టిక్‌టాక్‌ వీడియో ఓ యువకుడి ప్రాణం తీసింది. తన సహచరులే లేనిపోని ఆరోపణలతో ఓ వీడియో సృష్టించి దాన్ని వైరల్‌ చేశారంటూ ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కువైట్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడుకు చెందిన పుచ్చకాయల మోహన్‌కుమార్‌(30), రెండేళ్ల కిందట ఉపాధి పనుల నిమిత్తం కువైట్‌ వెళ్లాడు. అక్కడ ఓ ఇనుప దుకాణంలో పనిచేస్తూ తన సహచరులతో కలసి ఓ ఇంట్లో ఉంటున్నాడు. ఓ వ్యక్తి వద్ద స్నేహితుల భాగస్వామ్యంతో చీటీ కడుతున్నాడు. దాన్ని ఇటీవలే పాడుకున్నాడు. స్నేహితులకు డబ్బు ఇవ్వకుండా మొత్తం తీసుకొని కనిపించకుండా పోయాడంటూ అతని సహచరులు కొందరు మోహన్‌కుమార్‌ ఫొటోలతో ఓ వీడియో తయారు చేసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేశారు. అది వైరల్‌ అయింది. దాన్ని చూసి మనస్తాపానికి గురైన మోహన్‌ ఈ నెల 3న కువైట్‌లో తాను ఉంటున్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో మోహన్‌ మృతదేహాన్ని ఆదివారం శివకోడుకు పంపారు. ఈ సంఘటనపై అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని మృతుడి బావ రాజబాబు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.