
తాజా వార్తలు
ప్రభుత్వ ఏర్పాటు కోసం శివసేన ప్రయత్నాలు
ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తెలిపేందుకు శివసేనకు సమయం దగ్గరపడుతోంది. సర్కారు కొలువుతీరాలంటే సేనకు కాంగ్రెస్-ఎన్సీపీ మద్దతు తప్పనిసరి కావడంతో ఆ పార్టీల నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ఎన్సీపీ మాత్రం కాంగ్రెస్‌తో చర్చల తర్వాతే తమ వైఖరి తెలియజేస్తామని చెబుతోంది. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన బేరసారాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ రెండు పార్టీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిస్తే ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు చెరొకటి చొప్పున రెండు డిప్యూటీ సీఎం పదవులిస్తామని శివసేన ఆఫర్ ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యమంత్రి పదవికి కూడా సేన నుంచి అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ఏర్పడిన తర్వాత మిత్రపక్షాల మద్దతుతోనే సీఎం ఎన్నిక ఉంటుందని శివసేన వర్గాలు చెబుతున్నాయి.
గవర్నర్‌ను కలవనున్న ఏక్నాథ్
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరి తెలియజేసేందుకు శివసేన శాసనసభాపక్ష నేత ఏక్నాథ్ షిండే ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు. అటు తాజా పరిణామాలపై చర్చించేందుకు పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో సంజయ్ రౌత్ సమావేశమయ్యారు.
సోనియా నివాసంలో సీడబ్ల్యూసీ భేటీ
మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ ఈ ఉదయం అయ్యింది. శివసేనతో పొత్తు పెట్టుకుంటే ఎదురయ్యే ఇబ్బందుల గురించి పార్టీ నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం సేనతో చేతులు కలపాలని 85శాతం మంది మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
సమావేశమైన భాజపా కోర్ కమిటీ
అటు తాజా పరిణామాలపై భాజపా కోర్ కమిటీ కూడా భేటీ అయ్యింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నివాసంలో భాజపా నేతలు సమావేశమయ్యారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు కూడా భేటీ అయ్యారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
