
తాజా వార్తలు
హైదరాబాద్: కాచిగూడలో ఆగి ఉన్న రైలును ఎంఎంటీఎస్ ఢీకొన్న ఘటనలో క్యాబిన్ చిక్కుకున్న లోకో పైలట్‌ను వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంలో క్యాబిన్ నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న లోకోపైలట్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను కాపాడేందుకు ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమిస్తున్నారు. గ్యాస్ కట్టర్‌తో క్యాబిన్‌ను కత్తిరిస్తున్నారు. ప్రాణాపాయం కలగకుండా ఆక్సిజన్, సెలైన్ అందిస్తున్నారు. 7 గంటలుగా క్యాబిన్‌లోనే పైలట్ ఇరుక్కుపోయారు. మరోవైపు సోమవారం ఉదయం జరిగిన ఈ రైలు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించిన రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
