
తాజా వార్తలు
దిల్లీ: అధికార భాజపాకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో అందిన విరాళాలను ఆ పార్టీ వెల్లడించింది. వివిధ సంస్థలు, ట్రస్టుల నుంచి రూ.700కోట్లు అందాయని ప్రకటించింది. చెక్కులు, ఆన్లైన్ చెల్లింపుల రూపంలో ఈ మొత్తం సమకూరిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది. అయితే ఈ విరాళాల్లో దాదాపు సగం టాటాసన్స్ నేతృత్వంలోని ‘ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్టు’ నుంచే రావడం గమనార్హం. ఈ ట్రస్టు నుంచి రూ.356 కోట్లు సమకూరాయి. ఇక భారత్‌లో అత్యంత సంపన్న ట్రస్టు అయిన ‘ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు’ నుంచి రూ.54.25 కోట్ల విరాళాలు భాజపాకు అందాయి. భారతీ గ్రూప్, హీరో మోటార్‌కార్ప్, జుబిలియంట్ ఫుడ్ వర్క్స్, ఓరియెంట్ సిమెంట్, డీఎల్ఎఫ్, జేకే టైర్స్ లాంటి ఇతర కార్పొరేట్ సంస్థలు భాజపాకు విరాళాలు అందించిన వాటిలో ఉన్నాయి. రూ.20వేలు, అంతకు మించిన విరాళాలను కేవలం ఆన్లైన్లోనే స్వీకరించినట్లు భాజపా తెలిపింది. అయితే ఈ విరాళాల్లో ఎలక్టోరల్ బాండ్ల నుంచి వచ్చిన మొత్తాన్ని చేర్చకపోవడం గమనార్హం.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
