close

తాజా వార్తలు

పథకాలు పవన్‌కు కనిపించడంలేదా?: పేర్ని

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పెళ్లిళ్ల మీద మక్కువ ఉంటే, సీఎం జగన్‌కు ప్రజాసేవ మీద మక్కువ ఉందని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పవన్‌ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. జగన్‌ ఎప్పుడూ పవన్‌ గురించి వ్యక్తిగత విమర్శలు చేయలేదని పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు గురించి గతంలో చేసిన విమర్శలు పవన్‌ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని పాదయాత్ర సమయంలో జగన్‌ను ఎంతో మంది యువత కోరారని, వారి కోరిక మేరకే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పవన్‌కు కనిపించడంలేదని, చంద్రబాబు చెప్పిన ఇసుక సమస్య ఒక్కటే కనిపిస్తోందని పేర్ని నాని విమర్శించారు.

‘‘2014లో ప్రశ్నించడం కోసం పార్టీ పెడుతున్నానని పవన్‌ ప్రకటించినప్పటి నుంచి జగన్‌ మోహన్‌రెడ్డిని నోటికొచ్చినట్లు దుర్భాషలాడటం తప్ప మీరు చేసిందేమిటి? ఎన్నికల్లో ఎలాంటి భాష మాట్లాడారు. విశాఖ లాంగ్‌మార్చ్‌లో ఏం మాట్లాడారు? మీ అమ్మా..నాన్న మీకు నేర్పిన సంస్కారం, భాష అదేనా?. ఒక్కసారి తాట తీస్తే.. రాజకీయాల్లో ఎదుటి వాళ్లు పదిసార్లు తాట తీస్తారు. ఇది సినిమా కాదనే విషయం గుర్తుంచుకోవాలి. జగన్‌ మోహన్‌రెడ్డి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉండగా జగన్‌ మంచి వ్యక్తి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఆర్థిక నేరస్థుడయ్యారా? అని సుష్మాస్వరాజ్‌ పార్లమెంట్‌ సాక్షిగా అన్నారు. జగన్‌ 16 నెలలు జైల్లో ఎందుకు ఉన్నారో పవన్‌ కల్యాణ్‌కు తప్ప దేశమంతా తెలుసు. ప్రజలకు తెలుసుకాబట్టే 175 అసెంబ్లీ సీట్లలో జగన్‌ పార్టీకి  151 సీట్లు గెలిపించి ప్రజలకు మంచి చేయని పంపించారు’’ అని పేర్ని నాని అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.